Homeహైదరాబాద్latest Newsఛత్రపతి శివాజీ గురించి ఆసక్తికర విషయాలు..!

ఛత్రపతి శివాజీ గురించి ఆసక్తికర విషయాలు..!

నేడు ఛత్రపతి శివాజీ వర్ధంతి.. ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.. 1630 ఫిబ్రవరి 19న పుణె జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి దంపతులకు ఆయన జన్మించారు. ఆయన పూర్తి పేరు శివాజీ భోంస్లే. ఛత్రపతి శివాజీ భారతదేశాన్ని మొఘలుల బారి నుండి విముక్తి చేసి, మరాఠా సామ్రాజ్యానికి పునాది వేశాడు. మొఘలులకు వ్యతిరేకంగా యుద్ధానికి దిగిన శివాజీ శౌర్య పరాక్రమాలు చరిత్రలోని బంగారు పుటలలో నిక్షిప్తమయ్యాయి.

ఛత్రపతి శివాజీ మహారాజ్ తన 15 ఏళ్ల వయసులో మొఘలులపై తన మొదటి దాడిని చేశాడు. హిందూ సామ్రాజ్య స్థాపన కోసమే ఈ దాడి జరిగింది. దీనినే గెరిల్లా వార్‌ఫేర్ విధానం అంటారు. గెరిల్లా వార్‌ఫేర్ సూత్రం ‘హిట్ అండ్ రన్‌వే’. శివాజీ పరిపాలనా విధానంలో కూడా అగ్రగణ్యుడు. తన రాజ్యంలో మంత్రిమండలి, విదేశాంగ విధానంతోపాటు, గూడఛారి వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాడు. ప్రజల ప్రభువుగా పరిపాలన చేస్తూ.. వ్యక్తిగత విలాసాలకు ఏలాంటి తావివ్వలేదు.

1674 జూన్‌ 6న రాయగఢ్‌ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ‘ఛత్రపతి’ అని బిరుదును ప్రదానం చేశారు. 27 ఏళ్ల పాటు యుద్ధాలు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. నిరంతరంగా యుద్ధాలు చేస్తున్న సమయంలో తీవ్ర జ్వరంతో బాధపడి 1680 ఏప్రిల్‌ 3న మరణించారు.

Recent

- Advertisment -spot_img