Homeజిల్లా వార్తలుస్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు..

స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు..

ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం లో శుక్రవారం యోగా దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. యోగాకు సంబంధించిన గురువులు విచ్చేసి యోగా గురించి వివరించినారు. ఆసనాలు వేయడం జరిగినది. అనంతరం అధ్యక్షుడు యన్ విటి మాట్లాడుతూ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, యోగాతో శారీరిక, మానసిక, ఒత్తిడి నుండి ఎంతో ప్రయోజనం ఉంటుందని, వీటిపై అవగాహన పెంచుకోవడం కోసం ప్రతి ఒక్కరు ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని, శ్వాస వ్యాయామాలతో కూడుకొని మనుషులలో ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గిస్తుంది అన్నారు. అనంతరం వాసవి క్లబ్ సభ్యులు యోగ గురువులను సన్మానించినారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్ ,భాస్కర్ రెడ్డి, పిజే శాంసన్, తాళ్ల సురేష్ ,డాన్స్ మాస్టర్ క్రాంతి, పులిపాటి భాస్కర్, కరాటే మాస్టర్ శ్రీను, విద్యార్థి సంఘం నాయకులు ఆంజనేయులు, బాలు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సిబ్బంది పిఈటి రజిత, డాన్స్ మాస్టర్ జగన్, రామచందర్ షటిల్ ప్లేయర్స్ జగదీష్, నారాయణ, గంగరాజు, సముద్రాల వెంకన్న, యోగ గురువులుఅర్జున్ రెడ్డి, కృష్ణయ్య, మల్లేష్, జగదీశ్వర్, బ్రహ్మచారి, వెంకటనారాయణ, వాసవి క్లబ్ సభ్యులు నీల బిక్షమయ్య , విజయ పిఈటి, శిరీష, పద్మ, విద్యార్థులు క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img