Homeసైన్స్​ & టెక్నాలజీInternet : ఇంటర్నెట్​ సర్వీసులకు 26 ఏండ్లు

Internet : ఇంటర్నెట్​ సర్వీసులకు 26 ఏండ్లు

Internet : ఇంటర్నెట్​ సర్వీసులకు 26 ఏండ్లు

Internet : దేశంలో ప్రస్తుతం ప్రతి మనిషికి నిత్యావసరంగా ఇంటర్నెట్​ తప్పని సరి అయిపోయింది.

అయితే ప్రజలకు ఇప్పుడున్న ఇంటర్నెట్​ సర్వీసు ప్లాన్​లను అందుబాటులోకి తెచ్చి నేటికి 25 సంవత్సరాలు అయింది.

1995లో వాణిజ్యపరంగా లభించే మొట్టమొదటి ఇంటర్నెట్ ప్లాన్‌ను ప్రజలకు అప్పటి ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ విదేష్ సంచార్ నిగం లిమిటెడ్ (విఎస్‌ఎన్‌ఎల్) అందుబాటులోకి తెచ్చింది.

అప్పటికి దేశంలో కొంత మంది ధనికుల ఇంట్లో మాత్రమే కంప్యూటర్లు ఉండేవి.

అప్పటి ర్యాంలు ఇప్పటిలా జీబీల్లో లేవు కేవలం కేబీలలో ఉన్నాయి.

అప్పటి ఇంటర్నెట్​ స్పీడ్​ కూడా చాలా తక్కువే గూగుల్​ ఓపెన్​ అయ్యేందుకే కొన్ని నిమిషాల పాటు కచ్చితంగా వేచి ఉండాల్సిందే.

VSNL తెచ్చిన ఇంటర్నెట్ సేవలు ప్రొఫెషనల్, వాణిజ్యేతర, వాణిజ్య, ఎగుమతిదారులు, సేవా సంస్థలు అనే ఐదు ప్లాన్​లు వచ్చాయి.

ప్రతి ప్లాన్​ వినియోగదారులకు అప్పటికే ఉన్న టెలిఫోన్ ఆప్టిక్స్ ఉపయోగించి డయల్-అప్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా లేదా ప్రత్యేకమైన ఇంటర్నెట్ లైన్ల ద్వారా కనెక్టివిటీ అందించబడింది.

9.6kbps డయల్-అప్, 64kbps, 128kbps స్పీడుతో ఇంటర్నెట్ లైన్లు ఉండేవి.

VSNL నుండి 9.6kbps డయల్-అప్ ఇంటర్నెట్ లైన్ ధర 15,000 ఫ్లాట్ వార్షిక రేటుతో ఉండేది, అది కూడా ఒకే విడతలో సంవత్సరానికి చెల్లించాల్సి ఉండేది.

ఈ రేటు ప్రకారం VSNL అందించిన 9.6kbps డయల్-అప్ ఇంటర్నెట్ కనెక్షన్ (నేటి రూపాయి విలువలో) రూ .75,000 కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, రోజుకు సగటున 40 నిమిషాలు ఇంటర్నెట్​ ఉపయోగించకుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img