ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన సినిమా ‘ఇంటర్ స్టెల్లర్’. ఈ సినిమాలో మాథ్యూ మెక్‌కోనాఘే, అన్నే హాత్వే, జెస్సికా చస్టెయిన్ మరియు మైఖేల్ కెయిన్ నటించారు. ఈ సినిమాని పారా మౌంట్, సిన్ కాపి, వార్నర్ బ్రదర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా అంత భూమి మీద మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లినప్పుడు విశ్వంలొ ఇంకేదైనా గ్యాలెక్సీ లో మనుష్యులు జీవించుటకు అనువైన స్థలం ఉందేమో వెతుకుటకు బయలు దేరిన నలుగురు వ్యోమగాములు చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కింది. ఈ సినిమా సైన్స్ ఫిక్షన గా క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించాడు. ఈ సినిమా స్క్రీన్ ప్లే మొత్తం చాలా కొత్తగా ఎవరు ఊహంచని విధంగా క్రిస్టోఫర్ నోలన్ రాసాడు. ఈ సినిమా 2014లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది.
అయితే ఈ సినిమా విడుదలై 10 సంవత్సరాల కావడంతో మళ్లీ థియేటర్లో రి-రిలీజ్ చేసారు. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విడుదలైంది. ఈ సినిమాని ఎక్కడ రిలీజ్ చేసినా డాలర్ల వర్షం కురుస్తోంది. ఈ సినిమాకి భారత దేశంలో భారీ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఇంటర్‌స్టెల్లార్ భారతదేశంలో తిరిగి విడుదల కాలేదు. దానికి కారణం అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా దేశంలోని అన్ని IMAX స్క్రీన్‌లను పొందడంతో ఇంటర్‌స్టెల్లార్ భారతదేశంలో దాని IMAX రీ-రిలీజ్‌ను కోల్పోయింది. అయితే, సైన్స్ ఫిక్షన్ చిత్రం 2025 ప్రారంభంలో భారతదేశంలో మళ్లీ విడుదలయ్యే అవకాశం ఉన్నందున ఇంటర్‌స్టెల్లార్ అభిమానులందరికీ శుభవార్త అనే చెప్పాలి.