Homeఫ్లాష్ ఫ్లాష్iPhone Hacking ఐ ఫోన్ యూజర్లు.. బీ కేర్ ఫుల్

iPhone Hacking ఐ ఫోన్ యూజర్లు.. బీ కేర్ ఫుల్

– హ్యాకర్లు ‘పెగాసెస్’​ స్పైవేర్​తో అటాక్ చేసేఅవకాశం ఉందని గుర్తించిన యాపిల్ సంస్థ

– ఐ ఫోన్లకు ఎమర్జెన్సీ సెక్యూరిటీ అప్​డేట్ల విడుదల

iPhone Hacking ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఐ ఫోన్లలోకి కొంతమంది హ్యాకర్లు స్పైవేర్​ను చొప్పించేందుకు అవకాశం ఉందని యాపిల్ సంస్థ గుర్తించింది. దీంతో తమ ఐఫోన్‌ యూజర్లకు అత్యవసర సెక్యూరిటీ అప్‌డేట్లను విడుదల చేసింది. ఇప్పటి వరకు గుర్తించని కొన్ని లోపాలను ఉపయోగించుకొని హ్యాకర్లు ఐఫోన్లలోకి స్పైవేర్‌ను ప్రవేశపెట్టేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అలర్ట్ అయిన యాపిల్‌.. సెక్యూరిటీ అప్‌డేట్లను అందించింది.

సిటిజన్‌ ల్యాబ్‌ అనే ఇంటర్నెట్‌ వాచ్‌డాగ్‌ ఐఫోన్‌ సాఫ్ట్‌వేర్‌లోని ఈ లోపాలను గుర్తించింది. వెంటనే యాపిల్‌ సంస్థకు సమాచారం అందించింది. వాషింగ్టన్‌ హెడ్డాఫీసుగా పనిచేస్తున్న ఓ సివిల్‌ సొసైటీ ఉద్యోగి ఫోన్‌లోకి ‘పెగాసస్‌ ’ అనే నిఘా సాఫ్ట్‌వేర్‌ను చొప్పించేందుకు ప్రయత్నించినట్లు సిటిజన్‌ ల్యాబ్‌ పరిశోధకులు గుర్తించారు. అసలు యూజర్‌ ఏమీ చేయకుండానే ఇది ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అయ్యేలా మాల్​వేర్​ను ప్రవేశపెట్టాలని చూసినట్లు తెలిపింది. ఇది యాక్టివేట్‌ అయితే, యూజర్‌కు తెలియకుండానే కెమెరా ఆన్‌ కావడం, వాయిస్‌ రికార్డవ్వడం వంటి యాక్టివిటీస్ వాటంతట అవే జరుగుతాయని వివరించింది. భారత్‌లో రాజకీయ నాయకులు, ప్రముఖులపై నిఘా కోసం ప్రభుత్వమే
పెగాసస్​ను కొనుగోలు చేసిందని అప్పట్లో తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఐఫోన్‌లోని ఈ లోపాలను సిటిజన్‌ ల్యాబ్స్‌ ‘జీరో-డే-బగ్స్‌’గా వ్యవహరించింది. అంటే వీటిని సరిదిద్దడానికి యాపిల్‌ వద్ద కనీసం ఒక్కరోజు కూడా లేదు. ఎట్టకేలకు యాపిల్‌ ఈ లోపాలను వెంటనే సరిదిద్ది సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందించింది. ఒకవేళ మీరు కూడా ఐఫోన్‌ యూజర్లయితే.. వెంటనే అప్‌డేట్‌ చేసుకోవడం బెటరని ఎక్స్​పర్ట్స్ సూచిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img