Homeఫ్లాష్ ఫ్లాష్IPL 2020: ధోనీ వల్లే సంజూ శాంసన్ ఎదగలేకపోయాడా..?

IPL 2020: ధోనీ వల్లే సంజూ శాంసన్ ఎదగలేకపోయాడా..?

IPL 2020లో అదరగొడుతున్న సంజూ శాంసన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ Kerala బ్యాట్స్‌మెన్‌పై Congress సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కురిపించాడు. ‘Rajasthan Royals నమ్మశక్యం కాని రీతిలో విజయం సాధించింది. సంజూ శాంసన్ నాకు పదేళ్లుగా తెలుసు. నాకు పరిచయమైనప్పుడు అతడికి 14 Years. ఏదో ఒకరోజు తప్పకుండా Next MS Dhoni అవుతాడు. ఐపీఎల్‌లో రెండు అద్భుత ఇన్నింగ్స్ తర్వాత.. ప్రపంచ స్థాయి ఆటగాడు వచ్చాడని మీరు తెలుసుకొని ఉంటారు’ అని థరూర్ Tweet చేశాడు.

వన్ అండ్ ఓన్లీ సంజూ శాంసన్​
‘‘అతడు Dhoni వారసుడు కాదు. వన్ అండ్ ఓన్లీ సంజూ శాంసనే. అతడు 2015 నుంచి అన్ని ఫార్మాట్లలోనూ రెగ్యులర్‌గా ఆడాల్సింది. అతడ్ని ఎవరితో పోల్చొద్దు. అతడికి సరైన అవకాశాలు ఇస్తే.. India తరఫున కూడా ఇలాగే ఆడేవాడు. World Cup లను గెలిచేవాడు. కానీ అలా జరగలేదు. అతడు ఈ రెండు ఇన్నింగ్స్‌లోనే కాదు.. భవిష్యత్తులోనూ ఇలాగే ఆడతాడు. అతడెన్నో రికార్డులు బద్దలు కొడతాడు. దేశానికి ఎన్నో వరల్డ్ కప్‌లు అందిస్తాడు. కాబట్టి అతణ్ని ఎవరితోనూ పోల్చొద్దు. అతడు మన Gods Own Country నుంచి వచ్చిన అద్భుతమైన మళయాళీ. అతడు ఇంకా అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంది’’ థరూర్ ట్వీట్‌కు Team India Ex Cricketer Sreesanth ఘాటుగా బదులిచ్చాడు.

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌ వ్యాఖ్యలతో మాజీ క్రికెటర్, MP Gautam Gambhir సైతం విబేధించాడు. ‘భారత క్రికెట్లో Sanju Samson.. సంజూ శాంసనే. అతడు ఎవరికో వారసుడు కావాల్సిన అవసరం లేద’ని గంభీర్ ట్వీట్ చేశాడు.

సంజూ భారత్ తరఫున 4 International టీ20ల్లో మాత్రమే ఆడిన శాంసన్.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే.. జట్టులో చోటు దక్కించుకోవడమే కాదు.. స్థానాన్ని పదిలం చేసుకోవడం కూడా ఖాయమనిపిస్తోంది కదూ.

Recent

- Advertisment -spot_img