Homeహైదరాబాద్latest NewsIPL 2024: కేఎల్ రాహుల్ ను కెప్టెన్సీ నుంచి తప్పించారా?

IPL 2024: కేఎల్ రాహుల్ ను కెప్టెన్సీ నుంచి తప్పించారా?

ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లక్నో జుట్టులో అనూహ్య వాతావరణానికి దారి తీసింది. ఈ మ్యాచ్ ఓడిపోవడంతో లక్నో ప్లేఆఫ్ అవకాశాలను మరింత క్లిష్టతరం చేసింది. చేతిలో ఉన్న మిగిలిన మ్యాచ్‌లను గెలవాల్సిన పరిస్థితిని ఏర్పడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా.. కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో బహిరంగంగా వాగ్వాదానికి దిగిన దృశ్యాలు మనకు కనిపించాయి. కేఎల్ రాహుల్ పట్ల సంజీవ్ గోయెంకా తీవ్ర అసహనం వ్యక్తం చేశారని తెలుస్తుంది. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే కేఎల్ రాహుల్ కెప్టెన్సీ కూడా పోతుందని అందరూ భావిస్తున్నారు. మిగతా మ్యాచ్‌ల వరకు జట్టు కెప్టెన్సీని వేరొకరికి అప్పగిస్తారని అభిప్రాయాలు వినిపిస్తుయి. ఇందులో మార్కస్ స్టోయినిస్ సహా ఒకరిద్దరు అనుభవజ్ఞుల పేర్లు ఖరారైనట్లు పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి. అయితే లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఎట్టకేలకు దీనిపై మౌనం వీడింది. జట్టుకు కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ కొనసాగుతారని పేర్కొంది. తనిపై వేటు వేయాలనే ఆలోచన కూడా లేదని వివరణ ఇచ్చింది. ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌కు అతనే కేప్టెన్‌గా ఉంటాడని స్పష్టం చేసింది.

Recent

- Advertisment -spot_img