ఐపీఎల్ 2024 సీజన్‌ను ముంబై ఇండియన్స్ ఓటమితో ముగించింది. వాంఖడే వేదికగా లక్నో సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీనితో ముంబై ఇండియన్స్ చివరి స్థానంలో నిలిచి మరోసారి చెత్త రికార్డు మూటగట్టుకుంది. 2022లోనూ 10వ స్థానంలో నిలిచిన ముంబై.. ఈసారి అదే స్థానంతో సరిపెట్టుకుంది. గతేడాది ప్లేఆఫ్స్ చేరిన జట్టు ఈసారి ఫైనల్ చేరి కప్పు కొడుతుందని అభిమానులు ఆశించారు. 2013 నుంచి 2020 మధ్య ఏకంగా 5 టైటిల్స్ గెలిచింది. తర్వాత కనీసం ఫైనల్‌కు కూడా చేరలేకపోయింది.