Homeఫ్లాష్ ఫ్లాష్IPL 2024: క్వాలిఫయర్-2 కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఆ జట్టుకే లాభం..?

IPL 2024: క్వాలిఫయర్-2 కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఆ జట్టుకే లాభం..?

ఐపీఎల్ 2024 సీజన్ చివరి దశకు చేరుకుంది. మరో రెండు మ్యాచ్‌లతో టోర్నీ ముగుస్తుంది. క్వాలిఫయర్-1లో ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్‌కు చేరుకుంది. ఎలిమినేటర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని ఓడించిన రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్-2కు సిద్ధమైంది. శుక్రవారం చెన్నైలో జరిగే క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం ఇదే వేదికపై కేకేఆర్‌తో ఫైనల్‌లో తలపడుతుంది. అయితే క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.
ప్రస్తుతం తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంతో పాటు 7 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే, రిజర్వ్ డే అయిన మరుసటి రోజు ఆట కొనసాగుతుంది. క్వాలిఫయర్-2తో పాటు ఫైనల్‌కు కూడా రిజర్వ్ డే కేటాయించారు. రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ జరగకుంటే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఫైనల్‌లోకి ప్రవేశిస్తుంది. ఈ లెక్కన కేకేఆర్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

Recent

- Advertisment -spot_img