Homeఫ్లాష్ ఫ్లాష్IPL 2024: రాజస్థాన్ రాయల్స్ ఓటమి.. సన్‌రైజర్స్ కి బాగా కలిసొచ్చిందిగా..?

IPL 2024: రాజస్థాన్ రాయల్స్ ఓటమి.. సన్‌రైజర్స్ కి బాగా కలిసొచ్చిందిగా..?

IPL 2024లో లీగ్ దశ క్లైమాక్స్‌కు చేరుకుంది. నిన్న జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కు పంజాబ్ కింగ్స్ షాక్ ఇచ్చింది. గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై విజయం సాధించింది. స్లో పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ర్యాన్ పరాగ్ (34 బంతుల్లో 48), రవిచంద్రన్ అశ్విన్ (19 బంతుల్లో 28) రాణించారు. సామ్ కరన్ ), రాహుల్ చాహర్ , హర్షల్ పటేల్ తలో రెండు వికెట్లతో చెలరేగారు. అనంతరం పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. స్యామ్ కరన్ ( 41 బంతుల్లో 63*) కెప్టెన్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ , చాహల్ రెండేసి వికెట్లు తీశారు. రాజస్థాన్ రాయల్స్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం విశేషం. అయితే రాజస్థాన్ రాయల్స్ ఓటమి SRH బాగా కలిసి వస్తుందని చెప్పాలి. రాజస్థాన్ రాయల్స్ ఓటమితో SRH కి పాయింట్ టేబుల్ టాప్ 2 లో నిలవాడని ఒక మంచి అవకాశం లభించింది. SRH తన మిగిలిన రెండు మ్యాచ్ లో గెలుస్తే టాప్ 2 నిలవడం దాదాపు గా ఖాయం అనే చెప్పాలి.

Recent

- Advertisment -spot_img