HomeTelugu NewsIPL-2024: ఆర్సీబీని కలవరపెడుతున్న వరుణుడు.. ఒకవేళ వర్షం పడితే ఆర్సీబీ ఇంటికే..

IPL-2024: ఆర్సీబీని కలవరపెడుతున్న వరుణుడు.. ఒకవేళ వర్షం పడితే ఆర్సీబీ ఇంటికే..

IPL-2024లో నేడు హై వోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈరోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకునే ఈ పోరు కోసం క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈరోజు మ్యాచ్ సజావుగా సాగుతుందా లేదా అన్న టెన్షన్ అందరిలోనూ మొదలైంది. వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగిస్తాడా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అయితే శుక్రవారం సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే నిన్న న్నస్వామి స్టేడియంలో వర్షం పడలేదు. ఇరు జట్లు ప్రాక్టీస్ కొనసాగించాయి.
ఈ మ్యాచ్‌లో CSK గెలిస్తే నెట్ రన్ రేట్‌తో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. అయితే ఆర్‌సీబీ ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే నెట్ రన్ రేట్ కీలకం. RCB ముందుగా బ్యాటింగ్ చేసి 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే, CSK 182 పరుగులకే పరిమితం కావాలి. వర్షం కారణంగా ఓవర్లు కుదించబడితే, వారు 10 ఓవర్లలో 130 పరుగులు చేసి CSKని 112 పరుగులకు ఆలౌట్ చేయాలి. 201 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.1 ఓవర్లలో ఛేదించాలి. 10 ఓవర్లలో 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 8.1 ఓవర్లలోనే పూర్తి చేయాలంటే బెంగళూరు ప్లే ఆఫ్‌కు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్‌కు చేరుకున్నాయి. కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తర్వాతి దశకు చేరుకున్నాయి.

Recent

- Advertisment -spot_img