Homeస్పోర్ట్స్ఐపీఎల్‌లో ఆడ‌నున్న‌ తొలి అమెరికన్‌ క్రికెటర్‌

ఐపీఎల్‌లో ఆడ‌నున్న‌ తొలి అమెరికన్‌ క్రికెటర్‌

దుబాయ్‌: ఐపీఎల్ 2020లో అమెరికన్‌ క్రికెటర్‌ అలీఖాన్‌ ఆడేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున ఆడటానికి డీల్‌ కుదుర‍్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 29 ఏళ్ల అలీఖాన్‌ యూఎస్‌ఏ తరఫున ఆడుతున్నాడు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో ట్రిన్‌బాగ్‌ నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అలీఖాన్ త‌న ఫాస్ట్‌బౌలింగ్‌తో అద‌ర‌గొట్టాడు. ఐపీఎల్ 20‌ నుంచి కేకేఆర్‌ ఆటగాడు హారీ గర్నీ భుజం గాయం కారణంగా వైదొలగగా, అతని స్థానంలో అలీఖాన్‌ను తీసుకోవడానికి కేకేఆర్ కు అవ‌కాశం ఉంది. ఒకవేళ అలీఖాన్‌ ఐపీఎల్ 20 ఆడితే మాత్రం అమెరికా నుంచి ఈ లీగ్‌ ఆడిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు ద‌క్కించుకుంటాడు.

Recent

- Advertisment -spot_img