Homeజిల్లా వార్తలునర్సంపేట ప్రజల అభివృద్ధి కోసమా…?పాలకవర్గ అభివృద్ధి కోసమా…?

నర్సంపేట ప్రజల అభివృద్ధి కోసమా…?పాలకవర్గ అభివృద్ధి కోసమా…?

ఇదేనిజం, నర్సంపేట: మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులుండగా ఇందులో కొంతమంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు తీరు బాగోలేదని పట్టణ ప్రజలు చర్చించున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా నర్సంపేట మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానంకై బిఆర్ఎస్ కౌన్సిలర్లు పావులు కదుపుతున్నట్లు ప్రజలు బహిరంగ గానే మాట్లాడుకుంటున్నారు. అయితే అవిశ్వాస తీర్మానం ప్రజలపై ఉన్న ప్రేమతో ప్రజల అభివృద్ధికేనా లేక అందిన కాడికి దండుకొని వాళ్ళు అభివృద్ధి చెందడానికా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

నర్సంపేట పట్టణ మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులు ఉండగా అందులో 18 వార్డులలో బిఆర్ఎస్ కౌన్సిలర్లు కాగా మిగతా కౌన్సిలర్లు ఇతర పార్టీకి చెందినవారు. అయితే ఈ మధ్య కాలంలో పట్టణ అభివృద్ధి జరగడం లేదన్న నెపంతో ప్రస్తుత మున్సిపాలిటీ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మాన అంశాన్ని లేవనెత్తుతున్నారని సమాచారం. ఈ సాకుతో ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీలోకి దూకడం కోసమా లేక ఉన్నన్నాళ్లు నాలుగు రాళ్లు వెనకేసుకోవడం కోసమా అని పట్టణ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా లేని అభివృద్ధి ఇప్పుడు అవిశ్వాస తీర్మానంపెట్టి ఏ విధంగా అభివృద్ధి చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అభివృద్ధి కోసమే అయితే ఉన్న ఆరు నెలల పాటు అందరూ కలిసికట్టుగా పనిచేసి బిఆర్ఎస్ పార్టీ ఉనికిని కాపాడతారో లేక మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఓడించినట్లు పార్టీ భవిష్యత్తుని కూడా కనుమరుగు చేసి పార్టీ ఫిరాయింపులు చేస్తారనేమోనని కిందిస్థాయి పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. తమ పాలకవర్గం గడువు మరో ఏడాదితో ముగుస్తుండడంతో అందిన కాడికి కాసులు దండుకోవాలని ఉద్దేశంతో అవిశ్వాస తీర్మానం పెట్టారని ఓ నలుగురు కౌన్సిలర్లు బేరసారాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img