Homeహైదరాబాద్latest Newsఎక్కువసేపు నిలబడితే వ్యాయాయం చేసినట్లేనా?

ఎక్కువసేపు నిలబడితే వ్యాయాయం చేసినట్లేనా?

వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి శక్తి పెరగుతుంది. అలాగే కొవ్వు తగ్గుతుంది. కానీ ప్రతి రోజూ వ్యాయామం చేయడం అందరికీ కుదరక పోవచ్చు. రోజూ కొంత సమయాన్ని వర్కవుట్ కోసం కేటాయించి క్రమం తప్పకుండా చేసే వారు కూడా కొన్ని సార్లు సమయం లేకనో వీలు కాకనే స్కిప్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వర్కవుట్​కు బదులుగా మీరు రోజంతా నిలబడి ఉంటే సరిపోతుందట. నమ్మలేకపోతున్నారా! మీరు రోజంగా నిలబడి ఉండటం, మీరు చేసే వ్యాయామంతో సమానమైన ఫలితాలను కలిగిస్తుందట.

ఎక్కువ సేపు నిలబడి ఉండటం శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా పోరాడటంలో సహాయపడుతుందట. ప్రముఖ వైద్యులు ఫ్రాన్సిస్కో లోపెజ్-జిమెనెజ్, 1000 మందికి పైగా ఎంచుకుని వారిపై అధ్యయనం చేశారట. దీని ప్రకారం నిలబడి ఉండటం వల్ల కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయట. ఒక వ్యక్తి నిమిషం పాటు నిలబడి ఉండటం వల్ల 0.15 కేలరీలను బర్న్ చేయగలుగుతాడు. దీంతో పాటు ఎక్కువ సేపు నిలబడి ఉండటం వల్ల కలిగే లాభాలేంటంటే:

రోజంతా కూర్చుని ఉండటం వల్ల అధిక బరువు పెగరడం సహా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని మనందరికీ తెలుసు. కాబట్టి వీలైనంత వరకు నిలబడి ఉండటం, లేదా అటు ఇటు తిరుగుతూ ఉండటం వల్ల కేలరీలను ఎల్లప్పుడూ ఖర్చు చేసినట్టు అవుతుంది. ఇది ఆరోగ్యకరమైన జీవక్రియకు సహాయపడుతుంది. నిలబడి ఉండటం వల్ల కేవలం బరువు తగ్గడమే కాకుండా శరీర భంగిమ ఆకర్షణీయంగా మారుతుంది. కండరాల స్థిరత్వం పెరిగి వెన్నెముక, నడుము, తొడలు వంటి ప్రాంతాల చుట్టూ కొవ్వు కరిగిపోవడమే కాకుండా బలంగా మారతాయి. మెడనొప్పిని తగ్గించడానికి, వెన్నెముక నొప్పిని నయం చేయడానికి నిలబడి ఉండటం బాగా సహాపడుతుంది. నిలబడి ఉన్నప్పడు వెన్నెముకపై ఒత్తిడి పడి శక్తిమంతంగా తయారవుతుంది. రక్త ప్రసరణ పెరగడమే కాకుండా కండరాల సంకోచానికి దోహదపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

Recent

- Advertisment -spot_img