HomeసినిమాSree Leela టైమ్​ అయిపోయిందా?

Sree Leela టైమ్​ అయిపోయిందా?

ఎంత అందమైన హీరోయిన్​కు అయినా ఒక్కోసారి అవకాశాలు రావడానికి ఎంతో టైమ్​ పడుతుంది. కొంతమంది మాత్రం ఓవర్​ నైట్​ స్టార్​ అయిపోతారు. ఆ తర్వాత ఇక కనిపించకుండా పోతారు. టాలీవుడ్ లో ఒకప్పుడు రష్మిక మందన్న, పూజా హెగ్డే ఒకప్పుడు ఓ ఊపు ఊపారు. ఇక ఉప్పెన టైంలో కృతి శెట్టి ట్రెండ్ అయింది. ఇప్పుడు ఆమె సైలెంట్​ అయ్యింది. వచ్చిన ప్రతి సినిమా ఒప్పుకోవడంతో చివరకు బెడిసి కొట్టింది. అన్ని సినిమాలు బెడిసి కొట్టాయి. చివరకు డైరెక్టర్లు ఆమెకు సైడ్ ఇచ్చేశారు. ఇక పెళ్లి సందడి మూవీతో శ్రీలీల లైమ్​ లైట్ లోకి వచ్చింది. ఆ తర్వాత ధమాకాలో తన డ్యాన్స్​ గ్రేస్​ తో యువతను కట్టిపడేసింది. శ్రీలీల వల్లే ఆ సినిమా వంద కోట్ల క్లబ్బులోకి చేరిపోయింది. దీంతో శ్రీలీల కు అవకాశాలు క్యూ కట్టాయి. చదువు పక్కన పెట్టి మరీ ప్రాజెక్టులన్నింటిని ఓకే చేసింది.

అసలు పాత్రకు ఉన్న ప్రాధాన్యం ఏమిటి? తాను చేస్తున్న కారెక్టర్లు ఏంటి? అన్నది కూడా చూసుకోకుండా అన్ని సినిమాలు ఒప్పుకున్నది. దీంతో స్కంధ, ఆదికేశవ, ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్​ ఇలా వరస డిజాస్టర్లు వచ్చి పడ్డాయి. భగవంత్ కేసరి మాత్రమే శ్రీలీల కెరీర్‌కు ప్రాణం పోసింది. అందులో శ్రీలీల పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. తాజాగా గుంటూరు కారం డిజాస్టర్​ కావడంతో శ్రీలీలపై అనేక కామెంట్లు వస్తున్నాయి. ఎంతసేపు డ్యాన్సులే కాదు నటన, ఫైట్స్అన్నింట్లోనూ తాను సత్తా చాటినపుడే ఈ రంగుల ప్రపంచం లో కొన్నలైన నిలబడగల్గుతారు. రొటీన్గా కాకుండా డిఫరెంట్ పాత్రలను ఎంచుకుంటేనే శ్రీలీలకు టాలీవుడ్‌లో మంచి భవిష్యత్తు ఉంటుంది. అసలే ఈ ఏడాది గుంటూరు కారంతో డిజాస్టర్లకు బోణి కొట్టినట్టుంది. మరి ఇప్పటికైనా శ్రీలీల కాస్త పంథాను మార్చుకుని పాత్రకు ప్రాధాన్యం ఉన్న కారెక్టర్లను ఎంచుకుంటుందో లేదో చూడాలి.

Recent

- Advertisment -spot_img