Homeజాతీయంరజనీ రాజకీయ ప్రవేశంపై ప్రకటన ఉండబోతుందా?

రజనీ రాజకీయ ప్రవేశంపై ప్రకటన ఉండబోతుందా?

చెన్నై: వ‌చ్చే ఏడాదిలోనే త‌మిళ‌నాడు ఎన్నిక‌లు.. స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుంది. దీంతో త‌మిళ‌నాడు రాజ‌కీయాలు క్ర‌మంగా వేడెక్కుతున్నాయి.

ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌తో పాటు క‌మల్‌హాస‌న్ రాజకీయ పార్టీ కూడా రంగంలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. వీరితో పాటు ర‌జినీకాంత్ పొలిటిక‌ల్ ఎంట్రీపై చాలా రోజుల నుంచి వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయితే రజినీకాంత్ తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని అంటున్నారు కానీ.. స్ప‌ష్ట‌త ఇవ్వ‌డం లేదు. దీంతో అంద‌రిలోనూ అస‌లు ర‌జినీకాంత్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం ఉంటుందా? లేదా? అనే సందేహాలు కూడా మొద‌ల‌య్యాయి.

ఈ నేప‌థ్యంలో రజినీకాంత్ మ‌రోసారి రాజ‌కీయ ఉత్కంఠ‌త‌కు తెర తీశారు. త‌న అభిమాన సంఘానికి చెందిన అధ్యక్షుల‌ను న‌వంబ‌ర్ 30న చెన్నైకు రావాలంటూ పిలుపునిచ్చారు.

వారితో ఉద‌యం తొమ్మిది గంట‌ల‌కు మీటింగ్ ఉంటుందని వారికి పంపిన సందేశాల్లో రజనీ పేర్కొన్నాడు. సూప‌ర్‌స్టార్ అస‌లు ఈ మీటింగ్ ఎందుకు పెడుతున్నార‌నేది అంద‌రిలోనూ ఆస‌క్తిని రేపుతుంది.

సోమ‌వారం జ‌ర‌గ‌బోయే మీటింగ్‌లో త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై సూప‌ర్‌స్టార్ క్లారిటీ ఇస్తార‌ని రజనీ అభిమానులు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img