Homeహైదరాబాద్latest Newsఅతిగా ఆశపడే ఆడది బాగుపడదు అంటే ఇదేనేమో.. దీనికి పూజా ఖేడ్కర్ కథ సరిగ్గా సరిపోతుందిగా.....

అతిగా ఆశపడే ఆడది బాగుపడదు అంటే ఇదేనేమో.. దీనికి పూజా ఖేడ్కర్ కథ సరిగ్గా సరిపోతుందిగా.. అసలు ఏం జరిగిందంటే..?

అతిగా ఆశ పడే ఆడది సుఖపడ్డట్టు చరిత్రలో లేదు. ఓ సినిమా అంటూ రజనికాంత్ చెప్పే డైలాగ్ చాలా పాపులర్. అచ్చం అలాంటిదే కదా మన మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ కథ.. మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ తన వైకల్యాల గురించి అబద్ధం చెప్పి సివిల్ సర్వీసెస్ పరీక్షలో నకిలీ గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో వివాదాస్పద ట్రైనీ ఆఫీసర్ పూజా ఖేద్కర్ ఎంపికను యూపీఎస్సీ రద్దు చేసింది. పూజ 2022 బ్యాచ్‌లో ఎంపికైంది. ఎంపిక ప్రక్రియలో, ట్రైనీ ఐఎఎస్ తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోటోగ్రాఫ్, సంతకం, ఇమెయిల్, మొబైల్ నంబర్ మరియు చిరునామాను మార్చి నకిలీ ఐడిని సృష్టించినట్లు కమిషన్ తెలిపింది. ఆమె కొత్త నకిలీ ఐడిలతో పరీక్షకు హాజరైందని కమిషన్ తెలిపింది. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో మోసం చేసి, అర్హత లేకున్నా ఓబీసీ, పీడబ్ల్యూడీ కోటాలో సివిల్స్‌ పరీక్షలో ప్రయోజనం పొందారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను అరెస్ట్‌ చేస్తారనే భయంతో పూజ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను పటియాల హౌస్‌ కోర్టు తోసిపుచ్చింది. యూపీఎస్సీకి చెందిన ఎవరైనా పూజకు సహాయం చేశారా? ఇంకా పూజతో ఎవరు ఉన్నారు.. అనే కోణంలో దర్యాప్తు చేయాలని కోణంలో విచారణ చేయాలని ఢిల్లీ పోలీసులను కోర్టు తెలిపింది.

Recent

- Advertisment -spot_img