Homeసినిమాసౌత్ వాళ్ల‌కు నడుము చూపిస్తే చాలు.. పూజా హెగ్డే

సౌత్ వాళ్ల‌కు నడుము చూపిస్తే చాలు.. పూజా హెగ్డే

హైద‌రాబాద్ః సౌత్ సినిమా ప్రేక్ష‌కుల‌కు హీరోయిన్ల నడుమంటే పిచ్చి అని, అది చూపిస్తే చాలు వారు పిచ్చెక్కిపోతార‌ని, హీరోయిన్ల‌ను ఎప్పుడూ మిడ్ డ్రెస్‌ల్లోనే చూడాలనుకుంటారంటూ పూజా హెగ్డే వ్యాఖ్యానించింది.

సోష‌ల్ మీడియాలో పూజా వ్యాఖ్య‌ల‌పై దూమారం రేగుతోంది. సౌత్ సినీ ఇండ‌స్ట్రీ గురించి ఆమే చేసిన‌ వ్యాఖ్య‌లపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

నీకు బ్రతుకునిచ్చిన దక్షిణాది ఇండస్ట్రీపైనే నీచపు కామెంట్లు ఎలా చేస్తావంటూ నెటిజన్లు ఆమెను నిలదీస్తున్నారు.

నీకు చేతనైతే ఎక్స్‌పోజింగ్ మానేసి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేసుకోవాలంటూ హితవు పలుకున్నారు.

హిందీలో మాత్రం నువ్వేమైనా సాంప్రదాయ పాత్రలు చేస్తున్నావా?.. ఇక్కడి కంటే ఘోరంగా ఎక్స్‌పోజింగ్ చేస్తున్నావంటూ మండిపడుతున్నారు.

ప్రస్తుతం పూజా ప్రభాస్, అఖిల్ స‌ర‌స‌న‌ సినిమాలు చేస్తోంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img