Homeజిల్లా వార్తలువిద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయ వృత్తి కే సాధ్యం: దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి మాజీ...

విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయ వృత్తి కే సాధ్యం: దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి మాజీ ఎంపీపీ కొండమల్లేపల్లి

ఇదే నిజం: కొండమల్లేపల్లి మండల పరిధిలోని బిసి బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న దయానంద్ పదవీ విరమణ సందర్భంగా రేఖా శ్రీధర్ రెడ్డి వారిని ఘనంగా సన్మానించారు. విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దడం కేవలం ఉపాధ్యాయ వృత్తి కే సాధ్యమని దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో ఈ పాఠశాల విద్యార్థులకు అండగా ఉంటామని, ఏ సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని, ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలలో ఉండాలని వారు తెలిపారు. దయానంద్ మాట్లాడుతూ.. ఈ పాఠశాలలో హై మాస్ట్ లైట్ ఏర్పాటు ద్వారా విద్యార్థులకు చదువుకోడానికి ఎంతో ఉపయోగపడ్డదని 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చాయని అలాగే ఈ పాఠశాలల్లో అనేక సౌకర్యాలు రేఖా శ్రీధర్ రెడ్డి కల్పించారని వారు తెలిపారు.
పాఠశాల నూతన ప్రిన్సిపల్ మల్లేశ్వరి మాట్లాడుతూ.. మా పాఠశాలకు కుర్చీలు అందజేశారు. పదవ తరగతి విద్యార్థులకు మోడల్ టెస్ట్ బుక్స్ అందజేశారు. ఇలా రాజకీయలలో వుంటూ నిస్వార్థ సేవ చేస్తున్న మాజీ ఎంపీపీ సేవలు మరువలేమని తెలిపారు.

Recent

- Advertisment -spot_img