Homeరాజకీయాలుమాజీ ఎంపీ వివేక్ ఇల్లు, ఆఫీసులో IT Rides

మాజీ ఎంపీ వివేక్ ఇల్లు, ఆఫీసులో IT Rides

– హైదరాబాద్​, మంచిర్యాలో తనిఖీలు

ఇదే నిజం, హైదరాబాద్: మాజీ ఎంపీ,చెన్నూరు కాంగ్రెస్‌ అభ్యర్థి వివేక్‌ వెంకటస్వామి ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లోని సోమాజిగూడ, మంచిర్యాలలోని ఆయన నివాసంతో పాటు బేగంపేటలోని వివేక్‌ ఆఫీసులోనూ సోదాలు జరిగాయి. సోమాజిగూడలోని నివాసంలో 4 గంటల పాటు తనిఖీలు కొనసాగాయి. వివేక్‌ సంస్థల్లోకి రూ.8కోట్లు చేరాయనే అంశంపై ఐటీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. మరోవైపు కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌లోని వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్ల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు.

Recent

- Advertisment -spot_img