Homeహైదరాబాద్latest News35 ఏళ్లుగా తినకుండా ఉంటోన్న మహిళ

35 ఏళ్లుగా తినకుండా ఉంటోన్న మహిళ

గత 35 ఏళ్లుగా ఆహారం తినకుండా జీవిస్తోంది ఒడిశాలోని శాంతిలత జెనా అనే మహిళ. ఆహారం దొరక్క కాదు. ఘన పదార్థాలు ఆమె ఒంటికి పట్టవని, కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాలన్న వైద్యుల సూచన మేరకు శాంతిలత అలా జీవిస్తోంది.

ఒడిశా బాలేశ్వర్‌ జిల్లాలోని అషిమిలా గ్రామానికి చెందిన 47 ఏళ్ల శాంతిలత జెనా అనే మహిళ గత 35 ఏళ్లుగా కేవలం పండ్ల రసాలు, టీలు లాంటి ధ్రవ పదార్థాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నారు. శాంతిలత 12 సంవత్సరాల వయస్సు నుంచే ఆహారం తినడం మానేశారు. ఆ సమయంలో ఆమెకు తన తల్లి ఏం తినిపించినా వాంతి చేసుకునేవారు. దీంతో ఆందేళన చెందిన ఆమె తల్లిదండ్రులు ఓ డాక్టర్​ను సంప్రదించారు. పలు రకాల పరీక్షలు జరిపిన అనంతరం జెనా శరీరానికి ఘన రూపంలో ఉండే ఆహారాలు పట్టవని కేవలం ధ్రవ రూపంలో ఉన్న వాటిని మాత్రమే ఆహారంగా ఇవ్వాలని సలహా ఇచ్చారు. ఇలా వైద్యుడి సూచన మేరకు అప్పట్నుంచి కేవలం నీళ్లు, టీ, జ్యూస్​ వంటి ధ్రవాలను మాత్రమే తాగుతున్నారు శాంతిలత. అయితే ఇవి తీసుకున్నా వెంటనే ఆమెకు వాంతులు అవుతాయి అని అయినా చాలా సంవత్సరాలుగా ఆమె ఆరోగ్యంగా జీవిస్తున్నారని అని శాంతిలత జెనాకు చెందిన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒక వ్యక్తి నీళ్లు తాగి కూడా బతకగలడని అక్కడి వైద్యులు చెప్తున్నారు. కానీ కొంతకాలం వరకే అది వర్కవుట్ అవుతుందని తెలిపారు. పండ్ల రసాలు తాగడం వల్ల శాంతిజెనా ఆరోగ్యంగా ఉన్నారని వ్యక్తీకరించారు. శనిదేవుడికి చేస్తోన్న పూజల ఫలితంగానే తాను జీవించి ఉన్నానని శాంతిలత చెబుతోంది.

Recent

- Advertisment -spot_img