Homeహైదరాబాద్latest Newsదారుణం.. మద్యం తాగొద్దన్నందుకు తల్లి, చెల్లిని ఓ దుర్మార్గుడు ఏం చేశాడో తెలుసా..?

దారుణం.. మద్యం తాగొద్దన్నందుకు తల్లి, చెల్లిని ఓ దుర్మార్గుడు ఏం చేశాడో తెలుసా..?

మద్యం తాగొద్దని చెప్పిన తల్లి, చెల్లిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అచ్చయ్యపాలెంకు చెందిన ములపర్తి రాజు మద్యానికి బానిసయ్యాడు. మద్యం మానేయమని తల్లి మందలించడంతో.. కోపోద్రిక్తుడైన రాజు తల్లిపై దాడి చేశాడు. అడ్డొచ్చిన చెల్లిని కూడా పొడిచాడు. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img