Homeహైదరాబాద్latest Newsజగదీశ్వర్ రెడ్డి మాట్లాడే సంస్కృతి నేర్చుకోవాలి: ధర్మార్జున్

జగదీశ్వర్ రెడ్డి మాట్లాడే సంస్కృతి నేర్చుకోవాలి: ధర్మార్జున్

ఇదే నిజం, హైదరాబాద్: కోదండరామ్ ను విమర్శించే నైతిక హక్కు జగదీశ్వర్ రెడ్డి కి లేదని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ధర్మార్జున్ మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ కొనుగోలు, విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమీషన్ ముందు తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరామ్ వాస్తవాలు వివరించినందుకే బిఆర్ఎస్ జగదీశ్వర్ రెడ్డి రెచ్చిపోయ్ మాట్లాడుతున్నాడని,నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడే సంస్క్రుతి ని నేర్చుకోవాలని ధర్మార్జున్ హెచ్చరించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ భద్రాద్రి పవర్ ప్లాంట్ కాలం చెల్లిన టెక్నాలజీ తో కూడిన కూడిన మిషనరీ తో నిర్మిస్తున్నారని టిజేఎస్ మాత్రమే కాదు తెలంగాణ జేఏసిగా 2016 నుండే మాట్లాడుతూ వచ్చామని గుర్తు చేశారు. అయితే ఈ రోజు న్యాయ, సాంకేతిక నిపుణుల సమక్షంలో జరుగుతున్న విచారణలో తమ అవినీతి అక్రమాల పుట్ట బయట పడుతుందనే భయంతో సమస్యను పక్కదారి పట్టించేందుకే జగదీశ్వర్ రెడ్డి అవాక్కులు, చవాక్కులు మాట్లాడుతున్నారని అన్నారు.తన పార్టీలో తన వ్యతిరేకులను బెదిరించినట్లుగా మమ్మల్నీ బెదిరిస్తే ఉరుకునే ప్రసక్తే లేదని ధర్మార్జున్ హెచ్చరించారు. ఒక వైపు విచారణ కమీషన్ ముందు ఎవరు వాంగ్మూలం ఇస్తే వాళ్ల మీద దాడి చేయడమే నీ ఉలిక్కి పాటుకు కారణం అర్ధమవుతున్నది అని అన్నారు. తమ దొంగతనం బయట పడుతుందని, ఎక్కడ జైలుకు పోవల్సి వస్తుందో నని బిజెపి బిజెపి నాయకులతోటి రహస్య మంత్రాంగం నడిపే జగదీశ్వర్ రెడ్డికి కోదండరామ్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఇక నుండి నల్లగొండ జిల్లాలోని నీ పార్టీ నాయకులే నిన్ను బట్టలూడపికే టైం దగ్గరోచ్చిందన్నారు. నల్లగొండ అనే కోత్త సెంటిమెంట్ డ్రామా తో మాట్లాడడం సరికాదని జగదీశ్వర్ రెడ్డి ని తీవ్రంగా విమర్శించారు ధర్మార్జున్.

Recent

- Advertisment -spot_img