HomeసినిమాJagapathi Babu's interesting post on the movie 'Salar' ‘Salar’ మూవీపై జగపతిబాబు Interesting...

Jagapathi Babu’s interesting post on the movie ‘Salar’ ‘Salar’ మూవీపై జగపతిబాబు Interesting Post

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ సలార్. ఈ మూవీపై ఆడియెన్స్​లో, ప్రభాస్​ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్​గా థియేటర్లలో గ్రాండ్​గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్​గా నటిస్తోంది. పృథ్వీరాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. జగపతి బాబు రోల్​పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉండే జగపతి బాబు.. తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. సలార్​తో పై మెట్టు ఎక్కబోతున్నా అంటూ ఒక ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటో ఆడియెన్స్​ను విశేషంగా ఆకట్టుకుంటున్నది. హొంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించారు.

Recent

- Advertisment -spot_img