Homeహైదరాబాద్latest News‘సీఎం రేవంత్ పాలన చూసి KTR తట్టుకోలేకపోతున్నాడు’

‘సీఎం రేవంత్ పాలన చూసి KTR తట్టుకోలేకపోతున్నాడు’

సీఎం రేవంత్ రెడ్డి ప్రజాకార్షణ పాలన చూసి కేటీఆర్ తట్టుకోలేక పోతున్నాడని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఈరోజు ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. ప్రతి విషయాన్ని కేటీఆర్ రాజకీయ కోణంలో చూస్తున్నారని అన్నారు. తమ గతం గురించి మాట్లాడితే.. బీఆర్ఎస్ పదేళ్లలో చేసిన అవినీతి, ఆరాచక పాలనపై మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: వారికి తెలంగాణ RTC మరో గుడ్ న్యూస్..

దేశంలో చాలా మంది సీఎంలు కూడా పార్టీలు మారారని.. అందులో తప్పులేదని జగ్గారెడ్డి అన్నారు. ఎప్పుడూ.. సీఎం రేవంత్ రెడ్డిని టార్టెట్ చేసి మాట్లాడడం సరికాదని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలవడంలో ఎలాంటి తప్పులేదని, తమ నియోజకవర్గ సమస్యలపై కలిసి మాట్లాడొచ్చిని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బీజేపీ ఎమ్మెల్యేలు బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డిలు సీఎంలు తరుచుగా కలిసే వారని గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: KTR సంచలన వ్యాఖ్యలు.. హామీలు అమలు చేయకపోతే నడిరోడ్డుపై..

సమైక్య రాష్ట్రంలో ఉన్న స్నేహపూరిత సాంప్రదాయాన్నే సీఎం రేవంత్ రెడ్డి కొనిసాగిస్తున్నారని.. ఇది చాలా అభినందనీయమని జగ్గారెడ్డి అన్నారు.

ఇది కూడా చదవండి: ఇప్పుడు రూపాయి లేకుండా అయోధ్యకు వెళ్లండి.. ఇలా..

Recent

- Advertisment -spot_img