Homeహైదరాబాద్latest Newsజగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా కేంద్రంలో బీ.ఎల్.ఎన్.ఎల్ గార్డెన్స్ లో ఆదివారం జిల్లా మున్నూరు కాపు సంఘం ప్రమాణ స్వీకారాన్ని ఘనంగా నిర్వహించారు. మున్నూరు కాపు కార్యవర్గ ప్రమాణ స్వీకారం,ఆత్మీయ సమ్మేళనంలో కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల జిల్లా జెడ్పి ఛైర్పర్సన్ దావ వసంత సురేష్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగిత్యాల మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన వొడ్నాల రాజశేఖర్ ప్రధాన కార్యదర్శి చిట్ల రమణ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.మున్నూరు కాపుల అభ్యున్నతికి ఎల్లవేళలా తన సహాయ సహకారాలు వుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు జగిత్యాల జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన వివిధ హోదాలలో వున్న కుల సంఘాలు అధ్యక్ష కార్యవర్గ సభ్యులు,ప్రజా ప్రతినిధులు,మున్నూరు కుల బంధావులు,తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img