Homeహైదరాబాద్latest Newsకూతుర్ని రేప్ చేసిన కేసులో...జగిత్యాల కోర్టు సంచలన తీర్పు

కూతుర్ని రేప్ చేసిన కేసులో…జగిత్యాల కోర్టు సంచలన తీర్పు

ఇదేనిజం, కోరుట్ల : కోరుట్లలో మైనర్ బాలికను రేప్ చేసిన ఘటనలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ కూతురిపై లైంగిక దాడి చేసిన కన్నతండ్రికి కోర్టు 25 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. కోరుట్ల ఎస్ఐ.కిరణ్ కుమార్ తెలిసిన వివరాల ప్రకారం..


కోరుట్ల మున్సిపల్ పరిధిలోని యెఖీన్ పూర్ గ్రామానికి చెందిన ఎల్లాల తుకారాం(40) అను వ్యక్తి తన మైనర్ కూతురుపై లైంగిక దాడి చేశాడు. ఈ కేసు విషయంలో బుధవారం జగిత్యాల జిల్లాలోని స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి నీలిమ నేరస్తునికి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. అదేవిధంగా రూ.10,000 జరిమానాతో పాటు రూ‌. 3 లక్షల పరిహారాన్ని కూడా బాధితురాలికి ఇవ్వాల్సిందిగా తీర్పునిచ్చారు.

ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ అధికారి కే. రాజశేఖర్ రాజు, కోర్టు పి.పి.జె. మల్లికార్జున్, లైజనింగ్ అధికారి జి. రాజునాయక్ (ఎస్.ఐ) కోర్టు కానిస్టేబుల్ బి. నీల నాయక్ లను జగిత్యాల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అభినందించారని ఎస్ ఐ కిరణ్ కుమార్ వివరించారు.

Recent

- Advertisment -spot_img