Homeహైదరాబాద్latest NewsJailer 2 : ''జైలర్ 2'' మూవీలో మెగాస్టార్.. ఒకే ఫ్రేమ్‏లో రజిని, చిరు, బాలయ్య.....

Jailer 2 : ”జైలర్ 2” మూవీలో మెగాస్టార్.. ఒకే ఫ్రేమ్‏లో రజిని, చిరు, బాలయ్య.. ఇక బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే

Jailer 2 : సూపర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా నటించిన సినిమా ”జైలర్”. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో ‘జైలర్’ సినిమాకి సీక్వెల్ గా ”జైలర్ 2” (Jailer 2) రానుంది. ఇటీవలే ”జైలర్ 2” మూవీ అనౌన్స్మెంట్ టీజర్ కూడా రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

అయితే ”జైలర్” సినిమాలో రజనీకాంత్ తో పాటు శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్ నటులు అతిథి పాత్రల్లో కనిపించారు. తాజాగా ఒక వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ”జైలర్ 2” సినిమాలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించనున్నారు అని టాక్ నడుస్తుంది. ఇప్పటికే బాలయ్యను నెల్సన్ దిలీప్ కుమార్ సంప్రదించగా, బాలకృష్ణ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. తాజాగా ఈ సినిమాలో చిరంజీవి కూడా నటించనున్నారు. అయితే రజనీకాంత్ ఇప్పటికే చిరంజీవికి ఫోన్ చేసి సినిమా చేయమని అడిగారని, చిరు కూడా అందుకు అంగీకరించారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రజనీకాంత్, చిరంజీవి, బాలయ్యలను ఒకే ఫ్రేములో కనిపిస్తే ఇంకా బాక్సాఫీస్ రికార్డులు షేక్ అవ్వాల్సిందే అని ఫ్యాన్స్ అంటున్నారు.

Recent

- Advertisment -spot_img