HomeరాజకీయాలుBRS​ పార్టీకి జలగం వెంకట్రావు రాజీనామా

BRS​ పార్టీకి జలగం వెంకట్రావు రాజీనామా

– అధిష్ఠానానికి రిజైన్ లేఖ అందజేత
– నేడు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం

ఇదేనిజం, హైదరాబాద్​: బీఆర్ఎస్​ నేత, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఆ పార్టీకి రిజైన్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్​ అధిష్ఠానానికి లేఖ రాశారు. నేడు కాంగ్రెస్​ అగ్ర నేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు సమమాచారం. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జలగం వెంకట్రావు ఢిల్లీకి చేరుకున్నారు. వీరి ఆధ్వర్యంలో వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయనకు బీఆర్ఎస్​ కొత్తగూడెం టికెట్ ఇవ్వలేదు. దీనికి తోడు పలుమార్లు అపాయింట్​ మెంట్​ కోరినా కేసీఆర్​ నిరాకరించినట్టు సమాచారం. దీంతో జలగం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.

Recent

- Advertisment -spot_img