Homeఫ్లాష్ ఫ్లాష్ఆస్కార్‌ బరిలో 'జల్లికట్టు'

ఆస్కార్‌ బరిలో ‘జల్లికట్టు’

న్యూఢిల్లీః మన దేశం తరపున ఆస్కార్ 2021 బరిలో మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ నిలిచింది.

మన దేశం తరపున హిందీ, మలయాళం సహా పలు భాషల్లో 27 చిత్రాలు ఆస్కార్ నామినేషన్స్‌కు పోటీ పడగా ‘జల్లికట్టు’ చిత్రాన్ని రాహుల్‌ రవైల్‌ అధ్యక్షతలోని జ్యూరీ ఎంపిక చేసింది.

తమిళనాడులోని సంప్రదాయ ఆట జల్లికట్టు. ప్రతి ఏటా ఈ ఆటను తమిళనాడులో భారీ ఎత్తున నిర్వహిస్తుంటారు.

ఈ ఆటను నిర్వహించడంపై పలు విమర్శలు కూడా ఉన్నాయి. ఈ ఆటను నిషేధించాలని చాలా మంది జంతు ప్రేమికులు కోరుతుంటారు.

సినిమా విషయానికి వస్తే.. జంతువులు, మనుషుల మధ్య ఉన్న ఎమోషన్స్‌ను చక్కగా తెరకెక్కించారు.

93వ ఆకాడమీ అవార్డ్స్‌ రేసులో నిలిచిన ఈ చిత్రానికి హరీస్‌ కథను అందించారు.

లిజో జోస్‌ పెల్లిస్సేరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆంటోని వర్గీస్‌, చెంబన్‌ వినోద్‌, వినోద్‌ జోస్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img