ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా జనసేన ఎమ్మెల్యే పులవర్తి ఆంజనేయులుకు అవకాశం దక్కింది. ఈ మేరకు ఆయన పేరును జనసేన పార్టీ అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. వైసీపీ తరపున ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికి పదవి ఇవ్వాలి. కానీ వైసీపీకి తగినంత బలం లేకపోవడంతో ఇవ్వకూడదని కూటమి నేతలు నిర్ణయించుకున్నారు.కాగా, పీఏసీలోని మొత్తం 12 మంది సభ్యులను ఎన్నుకునేందుకు గురువారం నామినేషన్ కార్యక్రమం నిర్వహించారు. కూటమి నుంచి అసెంబ్లీ నుంచి 9 మంది, మండలి నుంచి 3 మంది నామినేషన్ దాఖలు చేశారు.