HomeSocial Mediaవరంగల్ లో పార్టీ జెండాను ఆవిష్కరించిన జంగా రాఘవ రెడ్డి

వరంగల్ లో పార్టీ జెండాను ఆవిష్కరించిన జంగా రాఘవ రెడ్డి

ఇదేనిజం, వరంగల్: కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, హంటర్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో డిసిసిబి మాజీ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందని దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసిందని జంగా గుర్తు చేశారు.
తెలంగాణలో కేసీఆర్ నియంత, గడీల పాలన పోయి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పాలన వచ్చిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img