Homeసినిమాదీపావళికి ముందే రాబోతున్న‘జరగండి’..!

దీపావళికి ముందే రాబోతున్న‘జరగండి’..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్​గా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవెటెడ్ పొలిటికల్ డ్రామా మూవీ ‘గేమ్ చేంజర్’. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గేమ్​ చేంజర్​తో శంకర్ మళ్లీ తన మార్క్​ను చూపిస్తాడని ఆడియెన్స్​ ఆశిస్తున్నారు. అయితే, ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ సింగిల్ ‘జరగండి’ని మెగా ఫ్యాన్స్ అయితే విట్నెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పటికే మన టాలీవుడ్ నుంచి దీపావళి కానుకగా సూపర్ స్టార్ మహేశ్ మూవీ గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగిల్ ‘దమ్ మసాలా’ రిలీజై ఫ్యాన్స్​ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక నెక్స్ట్ బిగ్ ట్రీట్​గా రామ్ చరణ్ వంతే మిగిలింది. గేమ్​ చేంజర్​ నుంచి ఫస్ట్ సింగిల్​ను దీపావళి పండుగకు ఒకరోజు ముందే రిలీజ్​ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అఫిషీయల్​ క్లారిటీ రావాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img