న్యూఢిల్లీ: క్రికేట్లో మైసూర్ ఎక్స్‌ప్రెస్‌గా పిలిచే జవగళ్ శ్రీనాథ్ నేటితో 51 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అతన్ని గౌరవిస్తూ ఇంటర్నేషనల్ క్రికేట్ కౌన్సిల్(ఐసీసీ) ట్విటర్లో ఓ వీడియో పెట్టి శుభాకాంక్షలు తెలిపింది. తన సహచరుడు వెంకటేష్ప్రసాద్తో కలిసి జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ప్రపంచ వ్యాప్తంగా కష్టతరమైన పిచ్‌లపై ప్రత్యర్థులకు చుక్కలు చూపెట్టాడు. వన్డేల్లో భారత్ తరఫున 300 వికెట్లకుపైగా తీసిన ఒకే ఒక్క బౌలర్‌గా నిలిచి ఔరా అనిపించుకున్నాడు. కెరీర్ మొత్తం మీద 551 వికెట్లను సాధించాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ కప్పు గెలిచి కెరీర్‌ను ఘనంగా ముగింపు పలకాలని అనుకున్నా అది నెరవేరకుండానే క్రికెట్‌కు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. రిటైరైన తర్వాత ఐసీసీ మ్యాచ్ రిఫరీగా మారిన శ్రీనాథ్ ఇప్పటి వరకు 53 టెస్టులు, 223 వన్డేలు, 99 టీ20లకు ఆ సేవలందించాడు.
ఐసీసీ షేర్ వీడియో ముచ్చట్లు
2003 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టుకు చుక్కలు చూపెట్టాడు. ముందుగా ఇండియా బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 292/6 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. బ్యాటింగ్‌కు దిగిన లంక శ్రీనాథ్ ముచ్చెమటలు పట్టించాడు. మార్వన్ ఆటపట్టు, జయసూర్య, అరవింద డిసిల్వ, మబారక్‌ల వికెట్లు పడగొట్టి 40 పరుగులకే సగం జట్టును పెవిలియన్ పంపాడు. తర్వాత నెహ్రా, జహీర్‌ఖాన్ మిగతా వారి పనిపట్టడంతో లంక 109 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దాంతో 183 పరుగులతో ఇండియా భారీ విజయం తన ఖాతాలో వేసుకుంది. శ్రీనాథ్ పుట్టిన రోజు సందర్భంగా ఐసీసీ ఆ వీడియోను అభిమానులతో పంచుకుంది.
551 వికెట్ల మైసూర్ ఎక్స్‌ప్రెస్‌కు ఐసీసీ గౌరవం
RELATED ARTICLES