Homeఆంధ్రప్రదేశ్జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి మళ్ళీ అరెస్ట్

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి మళ్ళీ అరెస్ట్

జైలు నుంచి విడుదలై 24 గంటలు ముగియక ముందే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి మళ్ళీ అరెస్ట్​ అయ్యారు. దాదాపు నెలరోజుల నుంచి జైలులో ఉన్న తండ్రీ కొడుకులు నిన్ననే విడుదలై బయటకు వచ్చారు. తాజాగా ఓ అట్రాసిటీ కేసులో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. నిన్న కడప జైలు నుంచి విడుదలై తాడిపత్రి దారిలో భారీ ర్యాలీగా వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని అనుచరులను సీఐ దేవేంద్రకుమార్ కరోనా నేపద్యంలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్​ రెడ్డిలు సీఐపై తీవ్ర పదజాలంతో దూశించినందుకు అరెస్ట్​ చేసినట్లు తెలుస్తుంది.

దీంతో సీఐ దేవేంద్ర కుమార్ ఫిర్యాదు చేయగా, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతోపాటు వారిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి డీఎస్పీ తెలిపారు. అయితే ఈ అరెస్టు ప్రభుత్వ రాజకీయ కుట్రలు మాత్రమేనని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img