ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 పరీక్ష ఆదివారం జరగనుంది. దేశవ్యాప్తంగా 1.91 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో ఏపీ, తెలంగాణకి చెందిన వారే 46 వేల మంది ఉన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. బంగారు ఆభరణాలు, బూట్లు, డిజిటల్ పరికరాలను తీసుకెళ్లకూడదు. డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి. జూన్ 9న కీ, ఫలితాలను వెల్లడిస్తారు. జూన్ 10 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.