- రివ్యూ పిటిషన్ వేసే యోచనలో పలు రాష్ట్రాల సీఎంలు
- సీఎంలతో సోనియా మీటింగ్
న్యూఢిల్లీః జేఈఈ, నీట్ ఎగ్జామ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించాల్సి తీరాలనే కేంద్ర వైఖరిని విపక్షాలు తప్పుపడుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా విలయ తాండవం చేస్తున్నందునా జేఈఈ, నీట్ ఎగ్జామ్స్ కొన్నాళ్లూ వాయిదా వేయాల్సిందేనని విపక్షాలు పట్టుపడుతున్నాయి. అవసరమైతే మరోసారి సుప్రీం కొర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని పలు రాష్ట్రాల సీఎంలు యోచిస్తున్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పంజాబ్, ఝార్ఖండ్, పుదుచ్చేరి, రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా సీఎంలు ముక్త కంఠంతో ప్రభుత్వ మొండి వైఖరిని ఖండించారు. ఎగ్జామ్సై్ వాయిదాపై ప్రధాని మోడీకి ఉత్తరాలు రాసిన స్పందన లేదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. అవసరమైతే రాష్ట్రపతిని కలుద్దామని ఝార్ఖండ్ సీఎం హెమంత్ సొరేన్ అభిప్రాయపడ్డారు. ఎగ్జామ్స్ టైంలో కరోనా బారీన స్టూడెంట్స్ పడితే పరిస్థితి ఏంటని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నించారు. జేఈఈ, నీట్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని పలు రాష్ట్రాల సీఎంలతోపాటు రాహుల్‌గాంధీ, బాలీవుడ్ నటుడు సోనూసూద్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలతోపాటు అనేక మంది ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. సెప్టెంబర్ 1 నుంచి జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) అడ్మిట్ కార్డులు జారీ చేయడం గమనార్హం.