Homeహైదరాబాద్latest Newsమోదీ ఫొటోతో ఓటింగ్ శాతం పెరగనుందా?

మోదీ ఫొటోతో ఓటింగ్ శాతం పెరగనుందా?

మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ నియోజకవర్గంలో ఓ బంగారు వ్యాపారి, మోదీ అభిమాని వినూత్నంగా ఆలోచించాడు. ఓటింగ్ శాతాన్ని పెంచడానికి, యువతలో ఉత్సాహం నింపడానికి ప్రయత్నం చేశాడు నిర్మల్ శర్మ అనే వ్యాపారి. ప్రధాని మోదీ మెజార్టీని అంచనా వేసినవారికి ఓ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు అనౌన్స్ చేశాడు. మోదీ ఫోటో ఉన్న రూ. 2 వేల నోటును బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. ఫలితాలు వెలువడిన రోజు (జూన్ 4) బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ బహుమతులను ప్రదానం చేస్తారని పేర్కొన్నాడు. దీంతో మెజార్టీని అంచనా వేసే పోటీకి వందలాది రిజిస్ట్రేషన్లు వచ్చాయి.

“పోటీలో వేలాది మంది పాల్గొంటారు. ఇక్కడ పోటీలో ఉన్న విజేత 9-13 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించినున్నట్లు చెబుతున్నారు. 9-13 లక్షల మధ్య ఐదు నంబర్లు ఇస్తాం. అందులో ఒక నంబరును చెప్పాలి. అలా 51 మంది విజేతలను ప్రకటిస్తాం. ఈ పోటీలో పాల్గొనేవారి పేర్లు, మొబైల్ నంబరును రాసుకుంటున్నాను. వారు గెలిస్తే బహుమతులు ఇస్తా.” అని నిర్మల్ వర్మ తెలిపారు.

Recent

- Advertisment -spot_img