Jobs : ఏపీ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1136 SGTలు మరియు 1124 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ప్రాథమిక స్థాయిలో 1136 స్పెషల్ ఎడ్యుకేషన్ SGT పోస్టులను భర్తీ చేయడానికి మరియు సెకండరీ స్థాయిలో 1124 కొత్త స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేయడానికి ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. DSC ద్వారా ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.