HomeSocial Mediaగుడ్ న్యూస్.. దేవాదాయశాఖలో ఉద్యోగాలు..

గుడ్ న్యూస్.. దేవాదాయశాఖలో ఉద్యోగాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం ఎండోమెంట్స్‌ డిపార్ట్‌మెంట్‌.. కాంట్రాక్ట్ విధానంలో ఏఈఈ, టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన హిందూ మతస్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 70
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(సివిల్‌)-35, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)-05, టెక్నికల్‌ అసిస్టెంట్‌(సివిల్‌)-30.
అర్హత: టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఎల్‌సీఈ డిప్లొమా, ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్‌(సివిల్‌/ఎలక్ట్రికల్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు ఏఈఈకి రూ.35,000, టీఏకు రూ.25,000తో పాటు ఎక్స్ ట్రా అలవెన్సు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తిచేసి, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను ది కన్వీనర్, రిక్రూట్‌మెంట్‌ సర్వీస్, పవర్‌ అండ్‌ ఎనర్జీ డివిజన్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, గచ్చిబౌలి, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 05.01.2024.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img