HomeజాతీయంFIR on Boy : శ్రీకృష్ణుడు వెన్న దొంగిలించడం ఆధారంగా పిల్లాడిపై ఎఫ్‌ఐఆర్​ను తప్పుబట్టిన న్యాయమూర్తి..

FIR on Boy : శ్రీకృష్ణుడు వెన్న దొంగిలించడం ఆధారంగా పిల్లాడిపై ఎఫ్‌ఐఆర్​ను తప్పుబట్టిన న్యాయమూర్తి..

judge mentioned Lord Krishna in the case of filing an FIR against a child : కొన్ని కేసులకు సంబంధించి న్యాయమూర్తుల వెలువరించే తీర్పులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

తాజాగా ఓ దొంగతనం కేసును విచారించిన న్యాయమూర్తి సనా తన సంస్కృతి ఆధారంగా తీర్పు ఇచ్చారు. 

ఈ ఘటన బిహార్‌లో(Bihar) చోటుచేసుకుంది. వివరాలు.. భోజ్‌పూర్‌లోని అర్రా గ్రామానికి చెందిన బాలుడి తండ్రి బస్సు డ్రైవర్‌గా పనిచేసేవాడు.

అయితే రోడ్డు ప్రమాదంలో అతని తండ్రి వెన్నుముక్క విరిగింది. దీంతో అతడు నడవలేదు.

బాలుడి తల్లి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. అతని గ్రాండ్ పెరేంట్స్ కూడా చనిపోయారు.

దీంతో అతని బాధ్యతలను బంధువుల్లో ఒకరికి అప్పగించారు.

అయితే ఆ బాలుడు.. నలంద జిల్లాలోని హర్నౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెరో ఓపీ(Chero OP) గ్రామానికి చెందిన సునీతా కుమారి ఇంట్లోని రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన స్వీట్లను దొంగిలించాడు.

అంతేకాకుండా ఆమె మొబైల్‌ ఫోన్ తీసుకున్నాడు. ఈ ఘటన సెప్టెంబర్ 7వ తేదీన జరిగింది.

సెప్టెంబర్ శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారులు.. బాలుడి జువైనల్‌ కోర్టులో హాజరుపరిచారు.

అయితే అక్కడ తనకు ఆకలి వేయడంతో స్వీట్లు దొంగిలించానని, గేమ్ ఆడేందుకు మొబైల్‌ తీసుకున్నాని బాలుడు అంగీకరించారు.

ఇందుకు సంబంధించి విచారణ చేపట్టిన నలంద జువైనల్ జస్టిస్ బోర్డ్(Nalanda Juvenile Justice Board) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్వేంద్ర మిశ్రా(Manvendra Mishra) సనాతన ధర్మం ఆధారంగా చేసుకని తీర్పు వెలువరించారు.

‘శ్రీకృష్ణుడు వెన్న దొంగతనం చేయడం లీలా అయినప్పుడు.. పిల్లలు స్వీట్లు దొంగిలించడం కూడా నేరంగా పరిగణించరాదు’అని జస్టిస్ మన్వేంద్ర మిశ్రా బాలుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

సమాజంలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని అన్నారు. బాలుడికి ఆహారం లేని సమయంలో జరిగిన ఘటన ఇది అని భావిస్తున్నట్టుగా చెప్పారు.

అదే విధంగా హర్నౌత్ శిశు సంక్షేమ శాఖ అధికారిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి సందర్భంలో బాలుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయరాదని అన్నారు.

పోలీస్ స్టేషన్ జనరల్ డైరీలో వివరాలు రికార్డు చేసి.. సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు Dainik Jagran రిపోర్ట్ చేసింది.

‘బాలుడు దొంగతనం చేసిందని చెబుతున్న మహిళ.. ఒకవేశ ఆమె బిడ్డ కూడా పర్స్‌లో నుంచి డబ్బులు తీసుకుంటే పోలీసులకు అప్పగించి జైలు పంపేదా..?’అని మహిళ తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి మన్వేంద్ర మిశ్రా అడిగారు.

ఇక, బాలుడి సంరక్షణ, విద్య కోసం తగిన ఏర్పాట్లు చేయాలని భోజ్‌పూర్ శిశు సంక్షేమ యూనిట్ అసిస్టెంట్ డైరెక్టర్‌ను న్యాయమూర్తి ఆదేశించారు.

ఇందుకోసం తగిన చర్యలు తీసుకుంటామని.. శిశు సంక్షేమ శాఖ అధికారులు న్యాయమూర్తికి చెప్పారు.

Recent

- Advertisment -spot_img