Homeజాతీయంతీర్పుల్లో జడ్జీలు ఉపదేశాలు ఇవ్వొద్దు

తీర్పుల్లో జడ్జీలు ఉపదేశాలు ఇవ్వొద్దు

– సుప్రీంకోర్టు వెల్లడి

ఇదే నిజం, నేషనల్​ బ్యూరో: తాము వెలువరించే తీర్పుల్లో జడ్జీలు వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడం, ఉపదేశాలివ్వడం చేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. లైంగిక కోర్కెలను నియంత్రించుకోవాలంటూ మైనర్ బాలికలకు, మహిళలను గౌరవించడం నేర్చుకోవాలంటూ మైనర్ బాలురకు ఓ తీర్పులో కలకత్తా హైకోర్టు సూచించడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఇవి అనవసరమైన, తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలంటూ జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓక్‌, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. రాజ్యాంగ అధికరణం 21 ప్రకారం ఇటువంటి వ్యాఖ్యలు మైనర్ల హక్కుల ఉల్లంఘన పరిధిలోకి వస్తాయని తెలిపింది. తదుపరి విచారణను జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది. వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసేందుకు ఒక మహిళను కిడ్నాప్‌ చేసిన కేసులో నిందితుడికి పోక్సో చట్టంలోని 6 సెక్షన్‌ ప్రకారం శిక్ష విధించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన కేసులో కలకత్తా హైకోర్టులోని జస్టిస్‌ చిత్తరంజన్‌ దాస్‌, జస్టిస్‌ పార్థసారథి సేన్‌ ధర్మాసనం ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. వీటిని భారత ప్రధాన న్యాయమూర్తి సుమోటాగా విచారణకు చేపట్టారు.

Recent

- Advertisment -spot_img