HomeTelugu Newsజూ.ఎన్టీఆర్ కోర్టు ఇష్యూ..జరిగింది ఇదీ!

జూ.ఎన్టీఆర్ కోర్టు ఇష్యూ..జరిగింది ఇదీ!

టాలీవుడ్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్‌ హైకోర్టుకు వెళ్లారంటూ వచ్చిన వార్తలపై ఎన్టీఆర్ టీం స్పందించింది. అసలు ఆ ఫ్లాట్ 2013లోనే తారక్ అమ్మేశాడని, తనకు ఏం సంబంధం లేదంటూ ఓ నోట్ రిలీజ్ చేసింది.

అసలేం జరిగింది?

ఎన్టీఆర్ ఓ ఇంటి స్థలం వివాదానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. జూబ్లీహిల్స్‌ హౌజింగ్ సొసైటీలోని 681 గంజాల చదరపు గజాల స్థలం విషయంలో ఈ వివాదం నెలకొంది. గీత అనే మహిళ నుంచి తాను 2003లో సదరు స్థలాన్ని చట్ట ప్రకారం అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే కొనుగోలు చేసి.. అదే ఏడాది ఇంటి నిర్మాణం చేపట్టానని తారక్‌ చెబుతున్నాడు.

అయితే ఆ భూమిని ఎన్టీఆర్‌కు అమ్మిన వ్యక్తులు 1996లోనే తమ వద్ద తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారంటూ.. ఎస్‌బీఐ, ఓరియెంటల్‌ బ్యాంక్ ఆఫ్‌ కామర్స్‌, ఇండస్‌ఇండ్‌, బ్యాంక్ ఆఫ్‌ బరోడా బ్యాంకులు సర్ఫేసి యాక్ట్‌ ప్రకారం డెట్‌ రికవరీ ట్రైబ్యునల్‌ (డీఆర్‌టీ)ని ఆశ్రయించగా.. తాజాగా బ్యాంకులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే బ్యాంక్ నోటీసులను ఛాలెంజ్‌ చేస్తూ తారక్ మొదట డీఆర్‌టీలో పిటిషన్ వేశాడు. వాదనలు విన్న డీఆర్‌టీ ఆ స్థలంపై బ్యాంకులకే హక్కులుంటాయని తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫిర్యాదు మేరకు భూమి అమ్మిన గీతపై కేసు నమోదైంది.

ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. డీఆర్‌టీ కాపీ అందుబాటులో లేకపోవడంతో సమయం కావాలని తారక్ తరపు న్యాయవాది కోరారు. తదుపరి విచారణను వెకేషన్‌ బెంచ్‌ ముందు పోస్ట్ చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ నిరాకరించిన ధర్మాసనం జూన్ 6న వాయిదా వేసింది. కేసుకు సంబంధించిన వివరాల డాక్యుమెంట్లను జూన్ 3లోగా అందజేయాలని ఆదేశించింది.

Recent

- Advertisment -spot_img