HomeతెలంగాణJupally Krishna Rao:కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి

Jupally Krishna Rao:కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి

కూచుకుళ్ల, గుర్నాథ్ రెడ్డి కూడా..

  • ఖర్గే సమక్షంలో కండువా కప్పుకున్న నేతలు

ఇదే నిజం, ఢిల్లీ: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరికకు చాలా రోజులుగా బ్రేక్ పడుతున్నవిషయం తెలిసిందే. కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రియాంకా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని జూపల్లి భావించారు. కానీ వివిధ కారణాలతో కొల్లాపూర్ లో సభ జరగలేదు. దీంతో ఇవాళ ఆయన ఢిల్లీలో ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జూపల్లి కృష్ణారావుతోపాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img