కోలీవడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన సినిమా ‘కంగువ’. ఈ సినిమాలో సూర్యకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 14న విడుదలైంది. ఎన్నో భారీ అంచనాలు మధ్య విదుదలైన ఈ సినిమా తొలి రోజు నుండే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ కంగువా సినిమాపై సూర్య భార్య, నటి జ్యోతిక హాట్ కామెంట్స్ చేసింది. ‘కంగువా’ సినిమా మొదటి అరగంట బాగాలేదని తెలిపింది. అది కాకుండా మిగిలిన సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఆమె సూర్య భార్యగా కాకుండా సినీ ప్రియురాలిగా చెప్పాను అని తెలిపారు.