Homeహైదరాబాద్latest Newsముంజంపెల్లిలో ముగిసిన కబడ్డీ ఓపెన్ టోర్నమెంట్

ముంజంపెల్లిలో ముగిసిన కబడ్డీ ఓపెన్ టోర్నమెంట్

ఎండపల్లి, ఇదే నిజం: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ముంజంపెల్లి గ్రామంలో నిర్వహించిన కబడ్డీ ఓపెన్​ టోర్నమెంట్ పోటీలు ముగిశాయి. బీఆర్ఎస్​ నేత, ఎన్ఆర్ఐ వ్యాల్ల హరీశ్​ రెడ్డికి చెందిన వీహెచ్ఆర్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో మొత్తం ఏడు జిల్లాల నుంచి 34 జట్లు పాల్గొన్నాయి. రాజంపేటకు చెందిన బజరంగ్ టీం సభ్యులు మొదటి బహుమతి కింద రూ. 20 వేల నగదు కైవసం చేసుకున్నారు. వేములవాడకు చెందిన రెండో బహుమతి కింద రూ. 15 వేలు పొందారు.

ఇది కూడా చదవండి: రైతుబంధుపై శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు జమ ఎప్పుడంటే..?

సెమీఫైనల్స్​కు చేరిన రాజంపేటకు చెందిన బజరంగ్ జూనియర్టీం, చెక్కపల్లి కి చెందిన టీ మ్ ల కు చెరో 5వేల రూపాయల నగదు ను అందజేశారు. ముగింపు కార్యక్రమానికి జగిత్యాల జిల్లా జెడ్పీ చైర్​ పర్సన్​ దావ వసంత హజరై బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎంపీపీ వ్యాల్ల అనసూయ, బీఆర్ఎస్​ నేతలు వ్యాల్ల రాంరెడ్డి, సింహాచలం జగన్, జగన్మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, పానుగంటి రాజమల్లు, సింగిరెడ్డి మహిపాల్ రెడ్డి, హరీష్ రెడ్డి, బైరం తిరుపతి, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పందిళ్ల రాజిరెడ్డి, కొమ్ము సంజీవ్ యాదవ్, వెంకటేశ్వర యూత్ సభ్యులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇళ్లు లేనివారికి రూ.5లక్షలు.. 

Recent

- Advertisment -spot_img