Homeఫ్లాష్ ఫ్లాష్ఇంట‌ర్‌నెట్‌లో కాజల్‌ పెళ్లి ఫోటోలు వైరల్‌

ఇంట‌ర్‌నెట్‌లో కాజల్‌ పెళ్లి ఫోటోలు వైరల్‌

హైద‌రాబాద్ః ముంబాయిలోని ఓ హోట‌ల్‌లో కాజల్‌ అగర్వాల్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా ముగిసింది. చిరకాల స్నేహితుడు గౌతమ్‌ కిచ్లుతో కలిసి ఏడడుగులు వేశారు. మూడు ముళ్ల బంధంతో సరికొత్త ప్రయాణానికి నాంది పలికారు.

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో కాజల్‌ పెళ్లి ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇక కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో అన్ని నియమాలను పాటిస్తూ.. అత్యంత సన్నిహితుల మద్య ‘చందమామ’ మిసెస్‌గా మారిపోయారు.

గౌతమ్‌ కిచ్లు ఆఫ్-వైట్ అండ్‌ సిల్వర్ కలర్‌ షెర్వానీని ఎంచుకోగా, కాజల్ అగర్వాల్ ప్రకాశవంతమైన ఎరుపు రంగు లెహంగాలో తళుక్కుమన్నారు.

ఈ జంటను చూసిన వారంతా ‘మేడ్‌ ఫర్‌ ఇచ్‌ అదర్‌’ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక వివాహానికి ముందు ఈ జంట సంగీత్‌, హల్దీ వేడుకలను నిర్వహించారు.

నిషా అగర్వాల్, గౌతమ్‌తో పాటు మరి కొందరు స్నేహితులతో కలిసి కాజల్‌ ఈ వేడుకలో ఫుల్‌ ఎంజాయ్‌ చేశారు. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా తెగ వైరలయ్యాయి.

Recent

- Advertisment -spot_img