Homeసినిమాత్వరలోనే కాజల్​ పెళ్ళి.. అయిపోయిన నిశ్చితార్ధం...

త్వరలోనే కాజల్​ పెళ్ళి.. అయిపోయిన నిశ్చితార్ధం…

చందమామ సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న నటి కాజల్​ అగర్వాల్​. లక్ష్యీ కళ్యాణం చిత్రంతో తెలుగులో పరిచయమై సుదీర్ఘ కాలంగా తెలుగులో అగ్ర నటీమణుల్లో ఒకరిగా ఉంటోంది కాజల్​. అందం అభినయంతో పాటు తన మంచితనంతో అనేక మంది అభిమానులను సంపాదించుకుంది కాజల్​. తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి అవకాశాలు తెచ్చుకుని అక్కడ కూడా తన ప్రతిభ చాటి బాలివుడ్​లోనూ పలు సినిమాలలో నటించింది ఈ భామ.

అయితే ఈ మద్య సినీ వర్గాల్లో ఒక విషయం చాలా చర్చ నడుస్తుంది. గౌతమ్​ అనే పారిశ్రామికవెత్తతో కాజల్​ నిశ్చితార్ధం అయిందని, త్వరలోనే వివాహం కూడా జరగనుందని టాక్​. అయితే తన నిశ్చితార్ధం విషయాన్ని అభిమానులకు తెలియకుండా ఉండాలని కాజల్​ భావిస్తుందట. ఇక పెళ్ళి విషయం అయినా నేరుగా చెబుతుందో లేదా చెప్పదో మరి. ఇక గతంలోనే 2020లో తాను వివాహం చేసుకునే అవకాశం ఉన్నట్లు పలు ఇంటర్వ్యూలలో కాజల్​ తెలిపింది.

Recent

- Advertisment -spot_img