తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టునుద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. మా కరువులకు కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరమన్నారు. మా తపనకు..ఆలోచనకు.. అన్వేషణకు జలదౌత్యానికి.. నిదర్శనం కాళేశ్వరం.. కాళేశ్వరం అంటే ఒక్క బరాజ్ కాదని తెలియని మీ అజ్ఞానమంటూ మండిపడ్డారు. ఎక్కడో ఒక లోపం తలెత్తడం సహజం సరిదిద్దుకోగలమన్నారు. రాజకీయ కుళ్ళు కుతంత్రాలను దిష్టి చూపులను తట్టుకోగలమంటూ ట్వీట్ చేశారు.