ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ ‘కల్కి'(Kalki2898AD) బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ప్రభాస్‌తో పాటు ప్రముఖ నటీనటుల నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. విడుదలకు ముందే ఎన్నో రికార్డులు సాధించిన ‘కల్కి’.. విడుదల తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తోంది. ‘కల్కి’ నాలుగు రోజుల్లోనే రూ.555+కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్రబృందం తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేసింది.